నేషనల్ మార్ట్‌లో చోరీ
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ మార్ట్‌లో చోరీ జరిగినట్లు ఎస్సై విష్ణు వర్ధన్ తెలిపారు. రోజు మాదిరిగానే నేషనల్ మార్ట్ సిబ్బంది సోమవారం రాత్రి తా ళాలు వేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉద యం వచ్చేసరికి సేఫ్టీలాకర్ ఓపెన్ అయి ఉండడంతో మేనేజర్ తుకారాం పోలీసులకు సమాచారం అందించాడు. లాకర్‌లో ఉన్న రూ.4.82 లక్షలు చోరీకి గురయ్యాయని మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. సీసీపుటేజీలో రికార్డయిన లాకర్ ఓపెన్ చేస్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఐటీడీఏ పీవోకు స్కోచ్ అవార్డు
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా గిరిజనులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో చేరినప్పటి నుంచి గిరిజనులకు చేరువ కావడంతో పాటు గిరిజన విద్యార్థుల్లో పౌష్టికాహార నివారణకు రాష్ట్రంలో మొదటిసారిగా గిరిజన పోషణ మిత్ర, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు గిరిజన క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడంలో పీవో ముందు వరుసలో నిలిచారు. ఈ నెల 29న న్యూఢిల్లీలో ఇండియా హబిటాట్ సెంటర్‌లోని జకరంద హాల్‌లో ఐటీడీఏ పీవో అవార్డు అందుకోనున్నారు.
నేషనల్ మార్ట్‌లో చోరీ
Comments
Please login to add a commentAdd a comment