గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలి
కాసిపేట: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న మోసపూరిత కుట్రను రద్దుచేసి సింగరేణి టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి, ఇల్లందు మైన్‌లకు సింగరేణి టెండర్‌లలో పాల్గొనవద్దని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు. తిరిగి అదే ప్రభుత్వం సింగరేణికి టెండర్ ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టెండర్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె చేసి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, బ్రాంచి ఇన్‌చార్జి చిప్ప నర్సయ్య, గని ఫిట్ సెక్రెటరీ మినుగు లక్ష్మీనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, నాయకులు నాగేశ్వరరావు, శ్రీహరి, రాజేందర్, సురేష్, సంతోష్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment