‘అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యే’
కోటపల్లి: మండల అభివృద్ధిని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విస్మరించారని, సమస్యల పరి ష్కారంలో విఫలమయ్యారని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 100మంది నిరుపేదలు నేటివరకు సహాయం అందక ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నిరుపేదలను మభ్యపెట్టారని విమర్శించారు. మండల అబివృద్ధిపై పెద్దపల్లి ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి చి త్తశుద్ధి ఉన్నా తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్ప నకు ఫ్యాక్టరీని నెలకొల్పాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, నాయకులు కందుల వెంకన్న, శ్యాంసుందర్, రాకేశ్, రాజేశ్, నవీన్, నర్సింలు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment