బొగ్గుగనుల టెండర్లలో పాల్గొనాలి
మందమర్రిరూరల్: నూతన బొగ్గు గనులను దక్కించుకునేందుకు నిర్వహించే టెండర్లలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఏరియాలోని కేకే–5 గనిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెండర్లలో పాల్గొనాలనే విషయంపై సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం తరఫున రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించినట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టెండర్లలో పాల్గొనవద్దని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు రెండు గనులు అప్పగించిందని ఆరోపిస్తూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఏఐటీయూసీలో చేరగా యూనియన్ కండువా లు కప్పి ఆహ్వానించారు. గని ఫిట్ కార్యదర్శి సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, వెంకటేష్, బానయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment