మంచిర్యాలక్రైం: జిల్లా బార్ అసిసోయేషన్ అధ్యక్షుడిగా బండవ రం జగ్గయ్య అలియాస్ జగన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. జి ల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఎన్నికల కమిషనర్ అనిల్‌రాజ్ ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు. 312మందికి గాను 287మంది ఓటు హ క్కు వినియోగించుకున్నారు. సత్తయ్యపై జగన్ 22ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా భుజంగ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కనుకుంట్ల మురళికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఆ వునూరి సతీష్, కోశాధికారిగా చకినారపు దత్తాత్రేయ, లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్‌కుమార్‌గౌడ్, మహిళా ప్రతినిధిగా బోగే ఉమరా ణి, స్పోర్ట్స్, కల్చరల్ కార్యదర్శిగా రంగు వేణుకుమార్, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మీప్రసన్న, సందెల మల్లేష్, కొట్టూరి సింధూజ, సోమ ప్ర దీప్‌చంద్ర, పెసర శ్రీకాంత్ ఎన్నికయ్యారు.