
మూతబడిన బార్ల పునరుద్ధరణ
● ఎకై ్సజ్ శాఖ నుంచి టెండర్ నోటిఫికేషన్ ● ఉమ్మడి జిల్లాలో ఐదింటి కోసం.. ● దరఖాస్తులు అధికంగా వస్తే లక్కీడ్రా యోచన
సాక్షి,ఆదిలాబాద్: రెన్యూవల్ చేసుకోకపోవడంతో మూతబడిన మద్యం బార్లను పునరుద్ధరించాలని ఎకై ్సజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ నుంచి రాష్ట్రంలో ఇలా మూతబడిన బార్లను ఇదివరకే గుర్తించారు. తాజాగా వాటి పునరుద్ధరణ కోసం రాష్ట్రంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉంటే జిల్లాల వారీగా దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా రెన్యూవల్ చేసుకోని బార్లు ఐదు ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ పట్టణంలో మూడు, బెల్లంపల్లి, నస్పూర్‌లలో ఒక్కొక్కటి చొప్పున మూతబడిన బార్లను పునరుద్ధరించే దిశగా ఎకై ్సజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఈనెలలోనే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఐదు బార్లకు రూ.42 లక్షల చొప్పున స్లాబ్ నిర్ణయించారు. ఇటీవల కాలంలో బార్లలో విక్రయాలు మందగించాయని పలువురు బార్ యజమానులు రెన్యూవల్‌కు ముందుకు రాలేదు. దీంతో గతేడాది నుంచి ఈ బార్లు మూతబడ్డాయి. తిరిగి తెరిపించాలని చూస్తున్న ఎకై ్సజ్ శాఖ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.
లక్కీడ్రా యోచన..
సాధారణంగా వైన్స్‌లకు టెండర్లు నిర్వహించినప్పు డు ప్రభుత్వం దరఖాస్తుదారుల నుంచి లక్కీడ్రా విధానంలో కేటాయింపు జరుపుతుంది. బార్ల కేటా యింపులో ఈ విధానం కనిపించదు. మధ్యలో లిక్క ర్ బార్ బిజినెస్ మందగించినప్పటికీ తాజాగా ప లువురు యువకులు వీటిని దక్కించుకునేందుకు ఆ సక్తి కనబర్చుతున్నారని ఎకై ్సజ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో అధికంగా దరఖాస్తులు వస్తాయ ని చెబుతున్నారు. మూడు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే దానికి సంబంధించి లక్కీడ్రా ద్వారా కేటా యింపు జరపనున్నట్లు శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలను త్వరలో రూపొందించి ప్రకటించనున్నట్లు తెలుస్తో ంది. వివరాలు అడిగేందుకు ఆదిలాబాద్ డీపీఈవో హిమశ్రీని మొబైల్‌లో సంప్రదించేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.