
ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మ క మూల్యాంకన(ఎస్‌ఏ–2) పరీక్షలు బుధవా రం ప్రారంభమయ్యాయి. 96,038 మంది వి ద్యార్థులు ఉండగా.. వీరిలో బాలురు 49,846, బాలికలు 46,192 ఉన్నారు. ఈ నెల 17వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి ప్రశ్నపత్రాలను ఆయా మండల కస్టోడియన్(ఎంఈవో) జాయింట్ కస్టోడియన్ సహా యంతో అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. 6 నుంచి 9వ తరగతుల ప్రశ్నపత్రాలను ఉద యం ఎనిమిది గంటలకు సంబంధిత ఎంఆర్‌సీ, కస్టోడియన్ హైస్కూల్ స్కూల్ నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.