
యువకుడి అదృశ్యంపై అనుమానాలు
సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్ (19) అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఈనెల 9న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సిర్పూర్(టి) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకున్ని హత్య చేసి పూడ్చి పెట్టారనే పుకార్లు రాగా శుక్రవారం కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కమలాకర్ టోంకిని గ్రామానికి వెళ్లి వచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు.