
వృద్ధురాలి ఇంట్లో చోరీ
కడెం(ఖానాపూర్): మండలంలోని లింగాపూర్‌లో పడాల గంగవ్వ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. గంగవ్వ ఇటీవల మండలంలోని పాత మద్దిపడగలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. ఈనెల 14న రాత్రి దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. మంగళవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు వృద్ధురాలికి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, క్లూస్‌టీం సిబ్బంది ఇంటిని పరిశీలించారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాలను పగులగొట్టి మూడు తులాల బంగారం, పది తులాల వెండి కడియాలు, రూ.15 వేల నగదు అపహరించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.