
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని బాల కేంద్రానికి చెందిన చిన్నారులు జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మహారాష్ట్రలోని వార్ధాలో ఈనెల 25, 26 తేదీల్లో రాష్ట్రీయ కళామంచ్, సచిన్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి నృత్యోత్సవ పోటీల్లో విజేతలుగా నిలిచారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో కూచిపూడి ఈవెంట్లో దువాస హర్షిని, కోండ్ర అలేఖ్య ప్రథమ స్థానంలో, జాహ్నవి క్షీరసాగర్ ద్వితీయస్థానంలో నిలిచినట్లు బాలకేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి తెలిపారు. జూనియర్ విభాగంలో ప్రథమస్థానంలో వర్ధిని, ద్వితీయ స్థానంలో శ్రీనిధి, సబ్ జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానంలో ఇతీక్ష కొంకటి, ద్వితీయ స్థానంలో రితీక్షా జంగిలి, ప్రాపర్టీ రౌండ్లో సన్నిధి దేశ్‌ముఖ్, హర్షిని ఠాకూర్ ప్రథమ స్థానంలో నిలిచారు. మహారాష్ట్ర వేదికగా జరిగిన పోటీల్లో బాలకేంద్రం చిన్నారులు ఇప్పటివరకు మూడు పర్యాయాలు ప్రథమ స్థానంలో నిలిచారని నిర్వాహకులు వెల్లడించారు.