
ఆంజనేయస్వామికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని పలు గ్రామాల్లో అదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ దుర్గాప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గోమారం, సికింద్లాపూర్, శభాష్‌పల్లి, గుండ్లపల్లి, దంతన్‌పల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని.. వినియోగదారులు సహకరించాలని కోరారు.
రైల్వేలైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేయాలి
మెదక్‌జోన్: మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వేలైన్ వేసేందుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కన్నపేట– మెదక్ రైల్వేలైన్ కోసం కృషి చేశానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు తెచ్చేందుకు కృషి చేసినట్టు చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఎన్నికై నందున శుభాకాంక్షలు తెలిపారు.
అలరిస్తున్న
శతావధానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని శ్రీలలితా చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన డాక్టర్ పట్వర్థన్ శతావధానం సాహితీ అభిమానులను ఎంతగానో అలరించింది. నిషిద్దాక్షరి, సమస్య, వర్ణన, దత్తపది, ఆశువు, అప్రస్తుతం తదితర అంశాలతో పృచ్చకులు అడిగే వాటికి అవధాని పట్వర్థన్ హృద్యంగా చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దొర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అవధానాలకు ప్రముఖ స్థానం ఉందని, సిద్దిపేటలో అవధానాలకు, అవధానులకు కొదువలేదన్నారు. అవధానంలో ఎంతగానో ఖ్యాతి గడించిన అష్టకాల నరసింహారామశర్మ మరణం తీరని లోటని అన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శతావధానం జరుగనుందన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పండరి రాధాకృష్ణ, సింగీతం నరసింహారావు, సరస్వతి రామశర్మ, ఉండ్రాళ్ల రాజేశం, మరుమాముల దత్తాత్రేయశర్మ తదితరులు పాల్గొన్నారు.
చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల సందడి
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. రెండవ శనివారం సెలవు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. దాతల సహాయంతో అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ శ్రీనివాస్, ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు దేవాదత్తశర్మ, ప్రభుశర్మ, దేవిశ్రీ, శ్రీవాత్సవ్‌శర్మ, సిబ్బంది ఉన్నారు.

శతావధానంలో కవులు, రచయితలు

Comments
Please login to add a commentAdd a comment