
ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం
మెదక్‌జోన్: ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే బీఆర్‌ఎస్ నేతలను తిరగనివ్వమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగువర్గాలను అవమానించారని, ఇప్పుడు అధికారం కోల్పోయాక అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక కొత్త నిబంధనలు తీసుకురావడమే కాకుండా.. ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోడియం వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను టార్గెట్ చేయడం మంచిది కాదని హితవుపలికారు. జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు మధుసూదన్, రుక్మిణి, ప్రవీణ్‌గౌడ్, శేఖర్, లింగం, దుర్గాప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Comments
Please login to add a commentAdd a comment