పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ రాక సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కేవీకేలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, సేంద్రియ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవీకే సమీపంలోని గిరిజన రైతుల పంట పొలాల్లో నాలుగు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల భూమికి నష్టం జరగకుండా మట్టితో క్యూరింగ్ చేయాలన్నారు. చెట్లు నరకవద్దని అధికారులకు సూచించారు. కాగా కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్ ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన 500 మంది సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో పాటు మరో 300 మంది రైతులు రానున్నారని తెలిపారు.
తప్పనిసరిగా మెనూ పాటించాలి
మెదక్‌జోన్: మెనూ తప్పకుండా పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కాలేజీని అకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, భోజనం నాణ్యతలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియెట్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణత శాతం పెరగాలంటే డ్రాపౌట్స్‌ను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకురావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment