పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
డీఈఓ రాధాకిషన్
అల్లాదుర్గం(మెదక్)/పెద్దశంకరంపేట/చేగుంట(తూప్రాన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సోమవారం అల్లాదుర్గం జెడ్పీ, ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నట్లు వివరించారు. ఆయన వెంట ఎంఈఓ ధనుంజయ్య ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు సులభ రీతిలో బోధన చేయడంతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈసందర్భంగా ఎఫ్‌ఎల్‌ఎన్ ద్వారా ఏ విధంగా బోధన చేపడుతున్నారో పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మక్కరాజీపేటలో పనిచేసిన సీఆర్పీల కుటుంబాలకు ఆర్థికసాయం పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment