పైరవీలకు తావులేదు | - | Sakshi
Sakshi News home page

పైరవీలకు తావులేదు

Published Tue, Mar 11 2025 7:26 AM | Last Updated on Tue, Mar 11 2025 7:26 AM

పైరవీ

పైరవీలకు తావులేదు

మెదక్‌ మున్సిపాలిటీ: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సంప్రదించాలని.. పైరవీలకు తావులేకుండా పోలీస్‌ సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్‌ఐ, సీఐలకు ఫోన్‌ ద్వారా సూచనలు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందని తెలిపారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను

వేగవంతం చేయండి

మెదక్‌జోన్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈనెల 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.

దుర్గమ్మ సేవలో

ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల వన దుర్గమ్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి దర్శి ంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం గాజులమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రంగు రంగుల గాజులతో అలంకరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి, నాయకులు కృష్ణ, సామ్యానాయక్‌, వెంకట్రాంరెడ్డి, రాజు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

111 మంది గైర్హాజరు

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవా రం ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 5,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 5,529 హాజరయ్యారు. మరో 111 మంది వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేదని జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి మాధవి తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌, సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు.

‘స్థానిక’ ఎన్నికల్లో

ప్రాతినిధ్యం కల్పించండి

మెదక్‌ కలెక్టరేట్‌: దివ్యాంగులకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలు యశోద ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మెదక్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌ లాంటి రాష్ట్రాలు చట్టాలు చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చట్టంలో సవరణలు చేసి దివ్యాంగులకు రెండు పోస్టులు నామినేట్‌ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీని ద్వారా దివ్యాంగులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పైరవీలకు తావులేదు 
1
1/2

పైరవీలకు తావులేదు

పైరవీలకు తావులేదు 
2
2/2

పైరవీలకు తావులేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement