
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగ అభివృద్ధికి 30 శాతం నిధులు కేటాయించి, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందన్నారు. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏడాదిగా హాస్టల్, మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నాయ కులు ని ఖిల్, విష్ణు సాంసన్, బాలరాజు పాల్గొన్నారు.
కరస్పాండెంట్‌కు
షోకాజ్ నోటీస్
వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం రా మంతాపూర్ గ్రామ శివారులో అనుమతులు రాకు ండానే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన తీరుపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ప్రైవేట్ ఇష్టారాజ్యం’ కథనానికి అధికారులు స్పందించారు. యూకేజీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్, పాఠశాలకు సంబంధించిన కరపత్రాల పంపిణీపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎంఈఓ లీలావతి సోమవారం జాన్స్ అకాడమీ కరస్పాండెంట్‌కు షోకాజ్ నోటీస్ అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైనా ప్రవేశ పరీక్షను నిర్వహించే ముందు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన సొసైటీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment