
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు
పాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్‌రావు తెలిపారు. సోమవారం మండలంలోని ముద్దాపూర్‌లో ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్యరంగా లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాపూర్ శివారులో రెండు బ్రిడ్జిలు, ఆలయం వరకు సీసీ రోడ్డు, బోరు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట నాయకులు ఆవుల గోపాల్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గౌస్, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండలంలోని భగీరథపల్లిలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించి మాట్లాడారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని అన్నారు. గతంలో సొంత జిల్లాలోని ఏడుపాయలను దర్శించుకునే సమయం కూడా అప్పటి సీఎంకు లేకపోయిందని, నేడు సీఎం రేవంత్‌రెడ్డి దుర్గామాతను దర్శించుకొని అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment