
చికెన్ వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ దెబ్బ
మెదక్ మున్సిపాలిటీ: బర్డ్ ఫ్లూతో చికెన్ వ్యాపారానికి బ్రేక్ పడగా, మటన్ దుకాణాలు, చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా భావించిన మటన్, చేపల వ్యాపారులు అమాంతం ధరలు పెంచేశారు. సండే వచ్చిందంటే.. ముక్క లేనిదే ముద్ద దిగదు...చికెన్ ప్రియులకు బర్ద్ ఫ్లూతో కాస్త బ్రేక్ పడింది. ఆదివారమైతే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపల కొనుగోలు ఎగపడుతారు. అయితే చికెన్‌తో బర్ద్ ఫ్లూ సోకుతుందన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీంతో చికెన్ కిలో రూ.200 నుంచి రూ.250 వరకు అమ్మేవారు. ప్రస్తుతం రూ.150లకు విక్రయిస్తున్న కొనేవారు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. క్వింటాళ్ల కొద్ది అమ్మే చికెన్.. ప్రస్తుతం కిలోలలో మాత్రమే అమ్ముడుపోతుందని వ్యాపారులు తెలిపారు. ఇదే క్రమంలో మటన్ డిమాండ్ విపరీతంగా పెడిగింది. కిలో మటన్ ధర రూ.720 ఉన్న రేట్లను 850 వరకు విక్రయిస్తున్నారు.
చేపల అమ్మకాల జోరు
చేపల అమ్మకాల జోరు కూడా విపరీతంగా పెరిగింది. కిలో చేపలు బొచ్చ, రౌటలు రూ.150 నుంచి 200 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో చేపలు రూ.250 నుంచి రూ.350ల వరకు బొచ్చలు విక్రయిస్తున్నారు. అలాగే కొర్రమీను కిలో రూ.600ల వరకు విక్రయిస్తున్నారు.
వెలవెలబోతున్న సెంటర్లు
మటన్ దుకాణాల కిటకిట
Comments
Please login to add a commentAdd a comment