
‘ఈ–బాహసే’ విద్యార్థులకు చేయూత
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్
నర్సాపూర్: మనదేశంలో యువత ప్రతిభకు తగ్గ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో 20న ప్రారంభమైన ఈ–బాహ సే ఇండియా పోటీలు ఆదివారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఈ–బాహ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు చేయూతనిస్తాయన్నారు. కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె మాట్లాడుతూ ఈ పోటీలలో 85 జట్లు నమోదు చేసుకున్నాయని, 44 జట్లు పోటీలలో చివరి దశకు చేరాయన్నారు. పోటీలలో పాల్గొన్న ఆయా కాలేజీల విద్యార్థులకు పలు విభాగాలలో బహుమతులు అందజేశారు. పూణెకు చెందిన పింప్రి చించ్వర్డ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, భీమవరానికి చెందిన విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ మహిళలు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ జట్టు తృతీయస్థానాన్ని దక్కించుకుంది. కార్యక్రమంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, ఈ– బాహ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్ సుబ్రమణ్యం, ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామనాథన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment