ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్లో పోలింగ్ బూతుల వద్ద పరిస్థితుల వివరాలను సేకరించాలని సూచించారు. జిల్లాలో 21 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటికి ఆయు ధాలు కలిగిన ఎనిమిది రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్టీలు, స్టాకింగ్ ఫోర్స్‌లు ఎల్లప్పుడు పోలింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 26న జరగబోయే ఏడుపాయల వన దుర్గామాత జాతర సందర్బంగా సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ డైవర్షన్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఏడుపాయల ప్రాంగణంలోనే నిద్రిస్తారు. కాబట్టి రాత్రి సమయంలో మఫ్టీ పార్టీలు, క్యూఆర్టీ పార్టీలు పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలు జరగకుండా చూడాలన్నారు. స్నానపు ఘాట్ల వద్ద అతిఉత్సాహంతో కొందరు లోతు ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారిని హెచ్చరించి ప్రమాదాలను నివారించాలి. ఆకతాయిల చర్యలను నివారించడానికి షీ టీం బృందాలు, మఫ్టీ పార్టీలు ఎల్లప్పుడు నిఘా ఉంచాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment