
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
డీపీఎం మోహన్
● కుక్కలకు పెరుగుతున్న క్రేజ్
● కుటుంబంలో ఒకటిగా
స్థానం కల్పిస్తున్న పెట్ లవర్స్
● ఇంటి రక్షణ కోసం పెంపకం
● జాతిని బట్టి రూ.వేల నుంచి
రూ.లక్షల్లో ఖరీదు
● పెట్ క్లబ్‌లకూ భలే డిమాండ్
● మంచి ఆహారం, కాస్మోటిక్స్, బాతింగ్
‘ఏం బతుకురా నీది.. కుక్క బతుకు’ అని చాలా తేలిగ్గా మాట్లాడుతాం. ఈ తిట్టుకు ఇప్పుడు అర్థం మార్చేస్తోంది ఆధునిక సమాజం. పూట కూడా గడవని మనుషులు ఒకవైపు.. విలాసాలకు అలవడిన ధనికులు మరోవైపుగా చీలిపోతున్న సమాజంలో పెంపుడు కుక్కలకూ మనషుల జీవనశైలి అలవాటు చేస్తోంది. ఇప్పుడు కుక్కలు పార్కులకు వెళ్తాయి.. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడతాయి..వాటికి నచ్చిన ఆహారం తింటాయి.. ఉదయాన్నే బయటికి వెళ్లి షికార్లు కొడతాయి. పుట్టిన రోజులు కూడా చేసుకుంటాయి. తోటి కుక్కలతో కలసి పార్టీలు చేసుకుంటాయి. మనిషి, శునకాల జీవనశైలికి అంతగా తేడాలేకుండా పోతుందని ఆశ్చర్యపడుతున్నారా? అవును.. రూ.లక్షలు ఖర్చు చేసి మరీ వాటి బాగోగులు చూస్తున్నారు. డాగ్ లవర్స్ అనే పరిధి దాటి పెట్ పేరెంట్స్‌గా చెప్పే స్థాయికి చేరుకుంది ఎలైట్ సొసైటీ. పెట్‌ను పెంచుకోవడమంటే వారి కుటుంబంలోకి ఓ వ్యక్తిని ఆహ్వానించినట్లే.. మరి ఆ అతిథిని వీరంతా ఎలా చూసుకుంటున్నారనే దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– పర్చ శ్రీనాథ్, రామచంద్రాపురం(పటాన్‌చెరు)
చిలప్‌చెడ్(నర్సాపూర్): సరైన పోషకాహారాలు భుజిస్తేనే సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తామని డీపీఎం మోహన్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రమైన చిలప్‌చెడ్‌లోని ఐకేపీ కార్యాలయంలో మహిళలకు పోషకాహారాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పరిశుభ్రమైన పదార్థాలతో, పరిశుభ్రంగా వంటలు చేసుకోవాన్నారు. చిన్నారులకు సరైన పోషకాహారాలు అందజేస్తేనే, వారు సరైన రీతిలో ఎదుగతారన్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య రాకుండా తీసుకోవాల్సిన పోషకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం ప్రేమలత, సీసీలు నర్మ, వెంకటలక్ష్మి, వరలక్ష్మి, ఆయా గ్రామ సంఘాల అధ్యక్షులు, ఆరోగ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వివరాలు
8లో u

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment