
కులగణన ఘనత కాంగ్రెస్‌దే..
మెదక్‌ను చార్మినార్ జోన్‌లో కలిపేందుకు చర్యలు
● నరేందర్‌రెడ్డిని పెద్దల సభకు పంపాలి ● మంత్రులు దామోదర, కొండా సురేఖ
మెదక్‌జోన్: దేశంలో ఇప్పటి వరకు కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. ఆ ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన హాజరై, మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌దే కీలకపాత్రని అన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులు, విద్యావేత్తల కోరిక మేరకు మెదక్‌ను చార్మినార్ జోన్‌లో కలిపేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నరేందర్‌రెడ్డి విద్యావంతుడని.. అలాంటి వ్యక్తిని పెద్దల సభకు పంపాలని పిలుపునిచ్చారు. ఎంపీ రఘునందన్‌రావు ఒక్క రూపాయి నియోజకవర్గ అభివృద్ధికి తీసుకురాలేదన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీకి మద్ధతు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మిగిలింది గాడిద గుడ్డేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచటంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రంలో చేసేది ఏమి ఉండదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, నేతలు హఫిజొద్దీన్, చౌదరి శ్రీనివాస్, జీవన్‌రావు, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment