
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పెద్దశంకరంపేట(మెదక్): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలకు మొద టి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఆ పార్టీ గెలవడం కష్టమన్నారు. అనంతరం గొట్టిముక్కులలో ఆత్మలింగ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పత్రి రామకృష్ణ, మండల అధ్యక్షుడు కోణం విఠల్, నాయకులు శ్రావణ్, కృష్ణ, సుధాకర్, సాయిలు పాల్గొన్నారు.
జీపీ కార్మికుల
వినూత్న నిరసన
మనోహరాబాద్(తూప్రాన్): నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోతే తాము ఎలా బతికేదని పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కార్మికులతో కలిసి మండల కేంద్రంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తమతో నిత్యం పనులు చేయించుకుంటున్నారు, గాని జీతాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహాశివరాత్రికి ఏడుపాయలకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారని.. జీతాలిస్తేనే వెళ్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు స్వా మి, అంజయ్య, అర్జున్, రాములు, బాలమణి, నవనీత, శోభ, లక్ష్మి, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, సూరి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లకు ఇబ్బందులు ఉండొద్దు
ఆర్డీఓ రమాదేవి
టేక్మాల్(మెదక్): త్వరలో జరగబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కల్గనివ్వొద్దని ఆర్డీఓ రమాదేవి తెలిపారు. శనివారం టేక్మాల్ ఉన్నత పాఠశాలలోని పోలీంగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. అన్ని రకాల వసతులను కల్పించాలని సూచించారు. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో తహసీల్దార్ తులసీరామ్, ఆర్‌ఐ సాయిశ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
150 మందికి
క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు
తూప్రాన్: మున్సిపల్ పరిధిలో శనివారం ప్రజలకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొన్ని రోజులుగా దగ్గు, దమ్ము, బరువు తగ్గుదల, జ్వరంతో బాధపడుతున్న 150 మందిని గుర్తించి వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పీహెచ్‌సీ వైద్యులు జ్యోత్స్న, సమత పేర్కొన్నారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదన్నారు. పైన పేర్కొన్న లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలతో పాటు మందులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీహెచ్‌ఓ బాలనర్సయ్య, సూపర్‌వై జర్లు శారద, పల్లవి, సిబ్బంది దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
Comments
Please login to add a commentAdd a comment