
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
● మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి ● కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వందశాతం ఉతీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రం హవేళిఘణాపూర్ మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును సరుకుల నిల్వ, అకౌంట్ రిజిష్టార్లను పరిశీలించిచారు. ప్రతిరోజూ సమయపాలన కచ్చితంగా పాటించాలని తెలిపారు. అలాగే సరుకుల నిల్వ గదిని పర్యవేక్షించి, కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం బస్తాలను, గుడ్ల నాణ్యతను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వంట గదిని పరిశీలించి, పరిశుభ్రత చర్యలను అనుసరించాలని, వండే విధానంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి, ప్రతిరోజూ మెనూ ప్రకారం వంట చేయాలని, పోషకాలతో కూడిన శుచిరుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. అనంతరం 9 వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారికి అందించే భోజనం, తదితర సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వెనుక పడి ఉన్న ఏదేని సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment