ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్లు తెలుగు, హిందీ, సంస్కృతం తదితర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు 107 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌నోడల్ అధికారి మాధవి తెలిపారు. జనరల్ 4,988 మందికి గానూ 4,889 మంది హాజరుకాగా 99 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు మరో 8 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ లెక్కన 98.02 హాజరు శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment