కొనసాగుతున్న రిలే దీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రిలే దీక్షలు

Published Fri, Mar 7 2025 9:38 AM | Last Updated on Fri, Mar 7 2025 9:33 AM

కొనసా

కొనసాగుతున్న రిలే దీక్షలు

నర్సాపూర్‌: ప్యారానగర్‌లో డంప్‌యార్డును ఎత్తి వేయాలన్న డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా దీక్షలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ పాల్గొని మాట్లాడారు. డంప్‌యార్డును ఎత్తివేసే వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డంప్‌యార్డు ఏర్పాటుతో నర్సాపూర్‌ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారం తప్పనిసరి

మెదక్‌ కలెక్టరేట్‌: పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ చూడా లని జిల్లా బాలల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షురాలు, డీసీపీఓ కరుణశీల అధికారులకు సూచించారు. గురువారం మెదక్‌ పట్టణంలోని బాల సదనంతో పాటు శివ్వంపేటలోని ఓరేబి మినిస్ట్రీ సీసీఐని తన బృందంతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పలయ్య, గంగాధర్‌, దిగంబర, చంద్రశేఖర్‌, చంద్రకళ, లావణ్య, రూప తదితరులు పాల్గొన్నారు.

తైబజార్‌ డబ్బుల

రికవరీలో అవినీతి

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీలో తైబజార్‌ వేలం పాటకు సంబంధించి డబ్బుల రికవరీలో అవినీతి చోటు చేసుకుందని సీఐటీయూ, కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి, రమేశ్‌ గురువారం మన్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నుంచి తాము తైబజార్‌ వేలానికి సంబంధించి వివరాల కోసం ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తైబజార్‌ వేలం పాటలో తీర్మాణించిన మేరకే సంబంధిత కాంట్రాక్టర్‌ వద్ద డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, రికార్డుల్లో మాత్రం తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు. ఈవిషయమై మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్యారానగర్‌లో సర్వేయర్ల బృందం పర్యటన

జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్‌ గ్రామంలో డంప్‌యార్డ్‌ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం అక్కడ పర్యటించింది. అటవీ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్‌లో డంప్‌యార్డ్‌ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి.

మహిళలకు

ఉచిత న్యాయ సలహాలు

న్యాయమూర్తి స్వాతిరెడ్డి

హుస్నాబాద్‌: మహిళలకు ఏ సమస్య తలెత్తినా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళ సంఘా ల సభ్యులకు లీగల్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశా రు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. గెలిచేది ఆడ, మగ అని కాదని, నైపు ణ్యం, సమర్థత ఎవరికి ఉంటుందో వారే ఉన్నతమైన హోదాలో ఉంటారన్నారు. ఆలోచనలో మార్పు రావాలని, ఆ మార్పుకు మహిళలే తొలి అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, సీడీపీఓ జయమ్మ, బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొనసాగుతున్న రిలే దీక్షలు 
1
1/1

కొనసాగుతున్న రిలే దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement