వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
మెదక్‌జోన్/నర్సాపూర్: రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం ఖా యమని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించటంతో గురువారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, బెండ వీణ, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్‌గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, శంకర్, అరవింద్, రాంరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment