మాదిగలకు రెండు మంత్రి పదవులివ్వాలి
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీగా వర్గీకరించాలని, అలాగే మంత్రివర్గంలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల డప్పుల ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని పునః సమీక్షించి శాసీ్త్రయంగా రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment