ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధునూదనాచారి అన్నారు. ఆదివారం చిన్నకోడూరులో జరుగుతున్న వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో వ్యవహరిస్తే అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. కాకతీయుల నాటి శివాలయాలు వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment