కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్,ఽ దర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయి..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా నిధుల విడుదల చేశామని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తామని, మహిళను కోటీశ్వరులను చేసేందుకు ప్రభత్వం అనేక పథకాలను తీసుకురానుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కొమురవెల్లి క్షేత్రంలో వసతులు కల్పిస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
స్వామి సన్నిధిలో
కుటుంబసమేతంగా పూజలు
Comments
Please login to add a commentAdd a comment