మెనూ పక్కాగా అమలు చేయాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించి, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. డైనింగ్ హాల్‌లో భోజనం చేస్తున్న విద్యార్థులను ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, వంట సరకులను నిల్వ చేసే గదిని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేశారు. నిత్యం పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు..? ఎలా చదువుతున్నారు? ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయానికి అందిస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను ఎంచుకొని బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట ఏటీసీ సునీత, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment