రవాణా శాఖలో అవినీతిని అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ వ్యవస్థను రద్దు చేసి అవినీతిని అరికట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్‌రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రవాణా శాఖలో అనధికార వ్యక్తులు అన్నింటా పెత్తనం చెలాయిస్తూ చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వాహనదారులు, అధికారులకు మధ్య ఏజెంట్లు మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్నీ తెలిసిన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంజీవులు, సంపత్‌కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్, సంజీవులు, కృష్ణ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment