
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మకు గురువారం పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూలతో అలంకరించి పల్లకీపై ఊరేగించారు. ఈఓ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు.
‘వర్గీకరణ తర్వాతే
నోటిఫికేషన్లు ఇవ్వాలి’
మెదక్ కలెక్టరేట్: ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ వర్తించేలా ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదన్నా రు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రిలే దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేసి గత అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మురళి, బాల్‌రాజ్, సంపత్‌కుమార్, గట్టయ్య, యాదగిరి, దేవేందర్, నాగరాజ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.