డీఈఓ రాధాకిషన్
చేగుంట(తూప్రాన్): బంగారు భవిష్యత్ కోసం కష్టపడి చదవాలని డీఈఓ రాధాకిషన్ విద్యార్థులకు సూచించారు. శనివారం చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రణాళికబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. అనంతరం కంప్యూటర్ శిక్షణ గదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూ పించాలని ఆదేశించారు.
ఏఐతో మెరుగైన బోధన
చిన్నశంకరంపేట(మెదక్): ఏఐతో మెరుగైన బోధన అందుతుందని డీఈఓ అన్నారు. శనివారం నార్సింగి మండలంలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏఐ స్కూల్ ప్రోగ్రాంను ప్రారంభించి మాట్లాడారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు ఏఐ బోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ స్కూల్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శన మూర్తి, జెడ్పీహెచ్‌ఎం తిరుపతి, పీఎస్ హెచ్‌ఎం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.