క్షణికావేశంతో జీవితాలు నాశనం | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశంతో జీవితాలు నాశనం

Published Wed, Apr 2 2025 7:34 AM | Last Updated on Wed, Apr 2 2025 7:34 AM

క్షణికావేశంతో జీవితాలు నాశనం

క్షణికావేశంతో జీవితాలు నాశనం

● చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు ● మెదక్‌ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌

హవేళిఘణాపూర్‌(మెదక్‌): క్షణికావేశంలో ఘర్షణలు పడితే జీవితాలు నాశనమవుతాయని మెదక్‌ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌ అన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మంగళవారం మెదక్‌ మండలం రాజ్‌పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవ పడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌తోపాటు అధికారులు గ్రామానికి చేరుకొని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని, ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు, పోలీసులు ఉన్నారని తెలిపారు. క్షణికావేశంలో పొరపాట్లు జరిగినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతీ పౌరుడు చట్టం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని, చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతీ ఒక్కరూ ఏదైనా తప్పు జరిగితే రాజీమార్గం వైపు మొగ్గు చూపాలే తప్ప దానిని పెద్దగా చేసి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురాకపోవడం మంచిదన్నారు. కార్యక్రమంలో మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ మురళి, డిప్యూటీ తహసీల్దార్‌ మహేందర్‌, గిర్దావర్‌ లక్ష్మణ్‌, సెక్రటరీ లింగం, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement