చిన్నశంకరంపేట(మెదక్): తీవ్రమైన ఎండలకు తోడు విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఓవర్ లోడ్‌తో నార్సింగి సబ్‌స్టేషన్‌లోని 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిలైంది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ డీడీ సోమేష్, ఏడీఏ యాదయ్య, ఏఈ స్వామి సబ్‌స్టేషన్ పరిశీలించారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తిరిగి ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రకటించా రు. అప్పటివరకు మరోలైన్ ద్వారా విద్యుత్ అందించినప్పటికీ కోతలు తప్పవని తెలిపా రు. అవసరమైతే రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా నార్సింగిలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు శనివారం ఉదయం సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సాగు నీటి ఇబ్బందులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.