మెదక్ కలెక్టరేట్: ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా చేపడుతున్నట్లు ఆర్డీఓ రమాదేవి తెలిపారు. శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఓటరు జాబితా నమోదు, బూత్‌స్థాయి ప్రతినిధుల నియామకంపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాకు సంబంధించి ఫారం 6, 7, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నూతన ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు తదితర వివరాలను నమోదుకు సహకరించాలని సూచించారు.