కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలోని ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంజేపీ సొసైటీ డీసీఓ, తునికి ఎంజేపీ ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బాలురు, బాలికల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 2025– 26 సంవత్సరంలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేక్ష పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.