మెదక్‌జోన్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై రెండు నెలలు కావొస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. మండలానికో నమూనా ఇంటిని నిర్మించతలపెట్టిన అవి సైతం పూర్తి కావడం లేదు. ఈ విషయంపై శనివారం సాక్షిలో ‘నమూనా.. పూర్తయ్యేనా’ అనే కథనం ప్రచురితం అయింది. దీనికి స్పందించిన కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్మిస్తున్న మోడల్ ఇళ్లు 45 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాణిక్యం, పీఆర్ ఈఈ నర్సింలు, డీఈ యాదగిరి ఉన్నారు.
దుర్గమ్మ సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
పాపన్నపేట(మెదక్): పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ మ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఈఓ చంద్రశేఖర్ ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి న్యా యమూర్తిని సత్కరించారు. వారి వెంట పాపన్నపేట ఎమ్మార్వో సతీష్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది ఉన్నారు.
ఇంటి పన్ను చెల్లించని
వారి ఆస్తులు జప్తు
రామాయంపేట(మెదక్): ఇంటి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేయాలని మెప్మా పీడీ, రాష్ట్ర మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్ ఆదేశించారు. శనివారం రామాయంపేట మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించి పన్నుల వసూళ్ల విషయమై సమీక్షించారు. ఈమేరకు కమిషనర్, మేనేజర్, ఆయా వార్డుల అధికారులు, బిల్ కలెక్టర్లతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో 95 శాతానికి పైగా పన్నులు వసూలు చేయాలని, నిర్లక్ష్యం చూపే అధి కారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పన్నుల వసూళ్లలో అలక్ష్యం వహించే వారి వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
నేడు దిష్టిబొమ్మల దహనం
నర్సాపూర్: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆదివారం ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ పట్ల జగదీశ్వర్‌రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదలను అగౌరవపర్చారని ఆరోపించారు. దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని కార్యకర్తలు, అనుబంధ సంస్థల నాయకులు విజయవంతం చేయాలని కోరారు.
పనుల్లో వేగం పెంచండి
పనుల్లో వేగం పెంచండి
పనుల్లో వేగం పెంచండి