మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులు అధైర్యపడొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో ‘సమగ్ర శిక్ష– అలిమ్‌కో’ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే ఉపకరణాలను వినియోగించుకొని ముందుకు సాగాలన్నారు. అలిమ్‌కో వైద్యులు విద్యార్థులను పరిశీలించి వారికి అవసరమైన ఉపకరణాలు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం, సమ్మిళిత విద్యా సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్