నర్సాపూర్: రూ. 7 కోట్ల నిధులు విడుదల చేసి రైతులకు పరిహారం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని కొల్చారం మండలం ఘనపూర్ ఆనకట్ట సామర్థ్యాన్ని 0.3 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా పనులు సైతం ప్రారంభించారని చెప్పారు. ఇందుకోసం రైతుల నుంచి సుమారు ఎనిమిది వందల ఎకరాల భూములు సేకరించారని వివరించారు. భూములు సేకరించిన ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. దీంతో పంటలు సాగు చేయలేక, పరిహారం అందక ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రైతులను పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు.
అసెంబ్లీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి