
దుర్గమ్మ సేవలో కలెక్టర్
పాపన్నపేట(మెదక్): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అదివారం కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
పాడి పంటలతో వర్థిల్లాలి
శివ్వంపేట(నర్సాపూర్): విశ్వావసు నామ సంవత్సరంలో రైతులు, ప్రజలు పాడిపంటలు, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. అ దివారం ఉగాదిని ఆమె సొంత గ్రామం గోమారంలో కు టుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా పచ్చడి తయారు చేసి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
బండ్ల ఊరేగింపు
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడలో మల్లన్న కమాన్‌ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
వెంకటేశ్వరశర్మకు
ఉగాది విశిష్ట పురస్కారం
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రానికి చెందిన వేద పండితుడు, బగలాముఖీ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది విశిష్ట పురస్కారం అందుకున్నారు. అదివారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ, కమిషనర్ శ్రీధర్ పురస్కారం అందజేశారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం ఉగాది పర్వదినం పురష్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేశారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
అలరించిన కుస్తీ పోటీలు
కల్హేర్(నారాయణఖేడ్): ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని మార్డిగ్రామంలో, సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా అలరించాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. చివరి కుస్తీ పోటీ విజేతకు వెండి కడియం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుర్రపు మశ్చేందర్, బీఆర్‌ఎస్ నాయకులు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రాజుకుమార్ సిగ్రె, తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో కలెక్టర్

దుర్గమ్మ సేవలో కలెక్టర్

దుర్గమ్మ సేవలో కలెక్టర్

దుర్గమ్మ సేవలో కలెక్టర్