
గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ జంటగా ‘మల్లేశం’ చిత్రం ఫేమ్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన చిత్రం ‘8 ఏఎమ్ మెట్రో’. శిలాదిత్య బోరా ప్లాటూన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మే 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు గుల్జార్ ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ చదివినప్పుడు గొప్ప అనుభూతి కలిగింది. అందుకే నా కవితలు అందించాను’’ అన్నారు.
‘‘మెట్రో ట్రైన్‌లో కలుసుకుని, ఒకరినొకరు తెలుసుకునే ఇద్దరు అపరిచితుల కథే ఈ సినిమా’’ అన్నారు రాజ్ రాచకొండ. ‘‘ఈ చిత్రంలో నా పాత్రకి ఒక సీక్రెట్ ఉంది. అది ఇద్దర్నీ వేరు చేయడంతో పాటు నమ్మకాల్ని కూడా చీల్చుతుంది’’ అన్నారు గుల్షన్.