
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరున్న ఆమిర్ సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకున్నానని చెప్పి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో పిల్లలతో సమయం గడపలేకపోతున్నాననిపించింది. వారికి ఏం కావాలో నాకు తెలియడం లేదు. అదే పెద్ద సమస్యగా మారింది. ఈ విషయం నాకు అర్థమవ్వడానికి చాలా కాలం పట్టింది.
ఆ సమయంలో నామీదే కాదు, సినిమా మీద కూడా కోపం వచ్చింది. సినిమాలే నాకు, నా కుటుంబానికి మధ్య గ్యాప్ అని అర్థం అర్థమయ్యింది. అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. అంతేకాకుండా సినిమాల నిర్మాణం నుంచి తప్పుకోవాలనుకున్నాను. గతంలోనే నా రిటైర్‌మెంట్ ప్రకటించానుకున్నా. కానీ లాల్ సింగ్ చద్దా సినిమా మార్కెటింగ్ స్టంట్‌గా ప్రేక్షకులు భావిస్తారని అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.
సాధారణంగానే నేను సినిమా సినిమాకి మధ్య 3-4ఏళ్లు విరామం తీసుకుంటాను. కాబట్టి లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత మూడు, నాలుగేళ్ల వరకు ఎవరికీ ఇబ్బంది ఉండదు. అలా నేను నిశ్శబ్దంగా సినిమాల నుంచి తప్పుకోవచ్చు అనుకున్నా. ఇదే విషయాన్ని భార్య, పిల్లలకు చెబితే నేను తప్పు చేస్తునన్నారు. వ్యక్తిగత, వృత్తి జీవితాలకి మధ్య బ్యాలెన్స్ పాటించాలని సూచించారు. కిరణ్ అయితే నా నిర్ణయం విని ఏడ్చేసింది. సినిమా లేకుండా నన్ను ఊహించుకోలేనని చెప్పింది. అలా లాక్‌డౌన్ రెండేళ్లలో చాలా జరిగాయి. రిటైర్‌మెంట్ గురించి ఎన్నోరకాలుగా ఆలోచించాను. ఇండస్ట్రీకి దూరమై మళ్లీ వచ్చాను' అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment