ఐశ్వర్యరాయ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే! అప్పటికి, ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలోనూ తన అందంతో, హావభావాలతో అదరగొట్టింది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు ఐశ్వర్య భర్త, హీరో అభిషేక్ బచ్చన్. చిత్రయూనిట్ కృషి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కొనియాడాడు. ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.
ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్్ స్పందిస్తూ.. 'ఇప్పటికైనా తెలిసిందిగా! నువ్వు ఆరాధ్యను చూసుకో, తనను మరిన్ని సినిమాలు చేయనివ్వు' అని కామెంట్ చేశాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. 'నేనేమైనా వద్దన్నానా? సర్, తను ఏది చేయాలనుకున్నా అందుకు నా అనుమతి అవసరం లేదు. అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను' అని రిప్లై ఇచ్చాడు. అతడి సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన ఫ్యాన్స్.. 'చాలా బాగా చెప్పారు సర్, అలాగే మీరిద్దరు కూడా కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా అభిషేక్, ఐశ్వర్య.. గురు, ధూమ్ 2, రావన్, ఉమ్రావో జాన్ వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరు 2007లో పెళ్లి చేసుకోగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐశ్వర్య ఒక్కరే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతుండటంతో వీరిమధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. కానీ అదంతా వదంతి మాత్రమేనని కొట్టిపారేశాడు అభిషేక్. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్ అని ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో షేర్ చేయగా దీనిపై అభిషేక్ స్పందిస్తూ నాకు కూడా ఫేవరెట్ అని కామెంట్ చేశాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్‌కు చెక్ పడినట్లైంది.
Let her sign??? Sir, she certainly doesn’t need my permission to do anything. Especially something she loves.
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) April 29, 2023
చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే?
Comments
Please login to add a commentAdd a comment