Abhishek Bachchan Politics: సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు దగ్గర సంబంధముంది. ఎంతలా అంటే నటీనటులుగా పేరు తెచ్చుకున్న చాలామంది.. పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ నుంచి త్వరలో పార్టీ పెట్టబోతున్న దళపతి విజయ్ వరకు ఈ లిస్ట్ పెద్దదే.ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ పేరు చెప్పగానే చాలామంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. 50 ఏళ్ల నుంచి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ఈయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా పలు సినిమాలు చేశాడు గానీ ఎందుకో తండ్రిలా హిట్స్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయని అభిషేక్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
(ఇదీ చదవండి: ఆడిషన్స్‌కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి)
ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీలోనే అభిషేక్ చేరబోతున్నాడట. అలానే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, 1984లో కాంగ్రెస్ తరఫున ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు కొడుకు అదే స్థానంలో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే అమితాబ్ భార్య, అభిషేక్ కి తల్లి అయిన జయా బచ్చన్.. ఇప్పటికే ఉత్తరప‍్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరి తల్లిదండ్రుల వారసత్వంగా అభిషేక్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలానే సినిమాల్లో రాణించలేకపోయిన అభిషేక్.. మరి పాలిటిక్స్ లో ఏం చేస్తారో చూడాలి.
(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment