ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు | Actor Mahesh Babu Review On Premalu Movie Telugu, Tweet Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Mahesh Babu Premalu Movie Review: చిన్న సినిమాకు పెద్ద రివ్యూ ఇచ్చిన మహేశ్

Published Wed, Mar 13 2024 9:22 AM | Last Updated on Wed, Mar 13 2024 10:53 AM

Actor Mahesh Babu Review Premalu Movie Telugu - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు. గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఓ మలయాళ డబ్బింగ్ చిత్రానికి తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చేశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన సినిమా 'ప్రేమలు'.  గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా.. శివరాత్రి కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ.. తెలుగులోకి తీసుకొచ్చాడు. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ కూడా పెట్టారు.

(ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు. తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు. ''ప్రేమలు'ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు. నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది. అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. కలెక్షన్స్ అయితే సాధించాడు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement