
సురేష్ గోపీ భారతీయ సినీ నటుడు, మాజీ ఎంపీ, గాయకుడు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం నాడు జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మహిళా విలేకరి భుజంపై రెండుసార్లు చేయి వేసి ఆమెతో సంభాషించడంపై వివాదం చెలరేగింది. మొదట మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన ఆమె కాస్త దూరం జరిగింది.
(ఇదీ చదవండి: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్)
కొంత సమయం తర్వాత ఆమె మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను అదే విధంగా తాకారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎంపీ సురేష్ గోపి నేడు సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు.
ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన ప్రవర్తించిన తీరు దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ' ఆమెను నేనొక కుమార్తెగా భావించా. ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశా. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా.' అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment