షూటింగ్ స్పాట్‌లో హీరో విశాల్‌కి గాయాలు.. వీడియో వైరల్‌ | Actor Vishal Get Severe Back Injury While Shooting Action Scene | Sakshi
Sakshi News home page

షూటింగ్ స్పాట్‌లో హీరో విశాల్‌కి గాయాలు.. వీడియో వైరల్‌

Published Wed, Jul 21 2021 4:57 PM | Last Updated on Wed, Jul 21 2021 6:46 PM

Actor Vishal Get Severe Back Injury While Shooting Action Scene - Sakshi

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ షూటింగ్‌ స్పాట్‌లో మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ‘నాట్ ఏ కామ‌న్ మేన్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో విశాల్‌తో పాటు పలువురు నటీనటులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విశాల్.. వెన్నుపూసకు భారీగా దెబ్బ తగిలింది. దీంతో వైద్యులు విశాల్‌కు చికిత్స అందించారు. ప్రస్తుతం విశాల్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది.విశాల్ ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

కాగా, గతంలో కూడా ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో విశాల్‌ గాయపడ్డాడు. ఓ ఫైట్‌ సీన్‌ చేస్తుండగా విశాల్‌ తలకు గాయమైంది. డూప్‌ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్‌ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. ‘నాట్ ఏ కామ‌న్ మేన్‌’విషయాకొస్తే.. విశాల్‌కి 31వ సినిమా ఇది. పి. శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో విశాల్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement