చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది ఇనయ సుల్తానా. ఏవమ్ జగత్ సినిమాలో నటించిన ఆమె రామ్‌గోపాల్ వర్మతో చేసిన డ్యాన్స్‌తో ఒక్కసారిగా పాపులర్ అయింది. అలాగే అతడితో అలా చిందులేయడమేంటని ఆమె కుటుంబంతో సహా ఎంతోమంది ఆమెను తిట్టిపోశారు. తాజాగా దీనిపై స్పందిస్తూ ఎమోషనలైంది నటి.
'నా పేరెంట్స్ సపోర్ట్‌తో ఇండస్ట్రీకి రాలేదు. వాళ్లు నన్ను ఉద్యోగానికి కూడా పంపించలేదు. కోవిడ్ టైంలో నాన్న చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో నేను వంద రూపాయలతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. రెండేళ్లవుతోంది. సినిమాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆర్జీవీతో పరిచయం ఏర్పడింది. నా బర్త్‌డేకి పిలిస్తే వచ్చారు. ఆయనకు నచ్చిన పాటలు ప్లే చేశారు. ఆయనతో డ్యాన్స్ చేశాను. అందులో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోతో నా ఇంట్లోవాళ్లు, బంధువులు, స్నేహితులు అందరూ అసహ్యించుకున్నారు. అందరూ నన్ను తప్పుగా చూస్తున్నారు. నేను పోర్న్ వీడియోలు చేయట్లేదు కదా, నేను ఇండస్ట్రీకి వచ్చి సినిమాలే చేస్తున్నా కదా, అయినా సరే వాళ్లకు నేను నచ్చలేదు. మా నాన్న సినిమాల్లోకి వెళ్దామనుకున్నప్పుడు కుటుంబ సమస్యలతో వెనకడుగు వేశాడు. ఆయన ఉండుంటే కచ్చితంగా నన్ను సపోర్ట్ చేసేవాడు.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. దాని వల్ల ఎన్నో ఆఫర్స్ వదులుకున్నాను. అవి మిస్ అవకపోయుంటే ఈపాటికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో ఉండేదాన్నేమో! కానీ ప్రస్తుతం నాకు వస్తున్న పాత్రలతో సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం యద్భావం తద్భవతి, నటరత్నాలు సహా మరో మూడు సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది ఇనయ సుల్తానా.
చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు
నిర్మాత శేఖర్ రాజుపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు..
Comments
Please login to add a commentAdd a comment